డబ్ల్యూహెచ్‌ఓ ఆహ్వానం అందలేదు: తైవాన్‌

0
150

ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెలలో నిర్వహించే సమావేశానికి తమకు ఆహ్వానం పంపలేదని తైవాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. అత్యున్నత స్థాయి హెల్త్‌ పాలసీలు రూపొందించే వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ నిర్వహించే సమావేశంలో పాల్గొనాల్సిందిగా తమ దేశ ప్రతినిధిని ఆహ్వానించలేదని పేర్కొంది. ఈ మేరకు తైవాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జోనే ఓయూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్‌ ఆహ్వానం కోసం చివరి నిమిషం వరకు తమ ప్రభుత్వం ఎదురు చూస్తునే ఉంటుందని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా డబ్ల్యూహెచ్‌ఓ తీరును తైవాన్‌ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. తైవాన్‌ తనను తాను స్వతంత్ర దేశంగా చెప్పుకొన్నప్పటికీ.. ఆ ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని చైనా వాదిస్తున్న నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ సభ్యత్వ దేశాల నుంచి తైవాన్‌ను తొలగించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here