కరోనా నేపథ్యంలో వచ్చే జూన్‌లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నాయి. అందుకే కొత్త విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ విద్యను తప్పనిసరి చేయాలని, తద్వారా జూన్‌లో అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు ఓ నివేదికను అందజేశాయి. మరోవైపు లాక్‌డౌన్ తర్వాత భౌతిక దూరం పాటించేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం మేలని కేంద్ర మంత్రి వివరించినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఆ నివేదికలోని ప్రధానాంశాలు..




























