రామ్‌చరణ్‌ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న రాజమౌళి…!

0
209

రాజమౌళి ఏ సినిమా తీసినా కూడా ఆ సినిమాలో నటించే ప్రతి ఒక్క నటీనటులు పూర్తిగా తనకే డేట్లు కేటాయించాలని, తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని అనుకుంటూ ఉంటాడు.ముందుగానే అలాంటి ఒప్పందం చేసుకుని మరీ సినిమాను రాజమౌళి మొదలు పెడతాడు.బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా అయిదు సంవత్సరాలు మరే సినిమాకు కూడా కమిట్‌ అవ్వకుండా కేవలం ఆ సినిమా కోసం సమయం కేటాయించాడు.

జక్కన్న ఏ సినిమా చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది.కాని ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో మాత్రం రివర్స్‌ ఉంది.హీరోయిన్‌ ఎంపిక నుండి పలు విషయాల్లో ఆయన చికాకును ఎదుర్కొంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ముఖ్యంగా రామ్‌ చరణ్‌ విషయంలో రాజమౌళి కాస్త అసహనంతో ఉన్నాడనే టాక్‌ వినిపిస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొనకుండా చరణ్‌ ఎక్కువగా తన నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటున్నట్లుగా టాక్‌ వస్తోంది.

జార్జియాలో చిత్రీకరణకు అంతా వెళ్లాల్సి ఉండగా సైరా ప్రమోషన్స్‌ కోసం అంటూ చరణ్‌ అక్కడకు వెళ్లలేదు.ఇక ప్రస్తుతం కూడా చిరంజీవి 152వ చిత్రం ప్రారంభోత్సవం కోసం అంటూ రెండు రోజుల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణకు బ్రేక్‌ పెట్టాడు.మొత్తానికి రాజమౌళి ఓపికకు రామ్‌ చరణ్‌ పరీక్ష పెడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ఒక భారీ సెట్టింగ్‌లో జరుగుతోంది.

చరణ్‌ నిర్మాతగా కొనసాగుతున్న కారణంగా హీరోగా ఇబ్బందులు పడుతున్నాడు.అందుకే రెండు పడవల కాలు మంచిది కాదంటారు.