వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతుండడం ఇప్పుడు పెద్ద రాజకీయ సంచలనంగా మారింది.ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడమే కాకుండా, ఎన్నికల్లో జగన్ తో ఢీ కొట్టారు.
పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన టార్గెట్ మొత్తం జగన్ అన్నట్టుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షం లో ఉన్న పవన్ మాత్రం ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు.
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పవన్ మాత్రం జగనే తమ ప్రధాన శత్రువు అన్నట్టుగా చూస్తున్నాడు.ఈ రాజకీయ శత్రుత్వం ఇలా కొనసాగుతుండగానే ఏపీ సీఎం జగన్ కలిసేందుకు పవన్ అన్న చిరంజీవి ప్రయత్నిస్తూ ఉండటం సంచలనం రేపుతోంది.
పవన్ కళ్యాణ్ తో జగన్ కు రాజకీయ విభేదాలు ఉన్నా సరే అవి ఏవి తాను పట్టించుకోకుండా ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని చిరంజీవి భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
జగన్ కూడా చిరంజీవి విషయంలో సానుకూల వైఖరి తోనే ఉన్నారు.సాక్షి మీడియా అవార్డు కూడా ఇటీవల చిరంజీవి కి దక్కింది.ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రమాణస్వీకారానికి చిరంజీవిని కూడా ఆహ్వానించినట్టు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఈ ఇద్దరిని మరింత దగ్గర అ చేసిందనే చెప్పాలి.సైరా సినిమా మీడియా పార్ట్నర్ గా చేసేందుకు అనేక మీడియా ఛానెల్స్ పోటీలు పడినా ఆ అవకాశం సాక్షికి దక్కడం వెనుక చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది.
సాక్షి కూడా సైరా నరసింహారెడ్డి భారీగా కవరేజ్ ఇచ్చింది.అదే సమయంలో జగన్ ప్రభుత్వం ఈ సినిమాకు స్పెషల్ షోస్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.ప్రస్తుతం జగన్ చిరు బేటీ లో ఏ విషయాలు ప్రస్తావనకు వస్తాయని విషయం అందరికీ ఆసక్తి గా మారింది.
జగన్ కలిసి సైరా సినిమా చూడాల్సిందిగా చెప్పడానికే మెగాస్టార్ వెళ్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నా ఇంకా వేరే వేరే విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు కొంతమంది రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా తన తమ్ముడు పవన్ జగన్ ను వ్యతిరేకించినా తాను మాత్రం అన్నివిభేదాలను పక్కన పెట్టి ఆయనతో సన్నిహితంగా మెలగాలని చిరు చూడడం వెనుక కారణం ఏంటో తెలియడంలేదు.ముఖ్యంగా ఈ ఇద్దరి భేటీపై పవన్, ఆయన అభిమానులు ఏ విధంగా స్పందిస్తారు అనేదే తేలాల్సి ఉంది.























