జూన్ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్ర జా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్ మొదటి వారంలో ప్రారంభిం చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్‌జోన్‌లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు.




























