లాక్‌డౌన్‌: 100 కోట్లకు వడ్డీ చెల్లించండి

0
327

న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ. 100 కోట్లు ఫండ్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చిన వడ్డీని న్యాయవాదులకు అందించాలని అడ్వకేట్‌ రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటినర్‌ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపిస్తూ.. లాక్‌డౌన్‌ కారణంగా న్యాయవాదులు కేసులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో కేటాయించిన రూ.100 కోట్ల ఫండ్‌కు వచ్చిన వడ్డీని కరోనా కష్ట కాలంలో న్యాయవాదులకు ఇచ్చి వారిని  ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here