దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యోచిస్తోంది. సార్స్–కోవిడ్2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడు తుందని దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు.




























