మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ!

0
383

కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు వేయడంతో విమానాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైరస్‌ కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విమానాలు నడిపేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి రానందున నాలుగో వంతు విమానాలు నడిపే అవకాశం కనిపిస్తోంది. రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉన్న విమానాల్లో తినుబండారాల సరఫరా అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ప్రయాణికులు, ముఖాలకు మాస్క్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పలు మార్గదర్శకాలను సైతం రూపొందిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here