రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటిది శనివారం మద్యం షాపులు మూసే సమయానికి కేవలం రూ.40.77 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మద్యం ధరల పెరుగుదల ప్రభావం మందు బాబులపై ఊహించిన దానికంటే ఎక్కువ పడింది.























