లాక్‌డౌన్, ఇతర కారణాలతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తోంది. విద్యార్థులు ఆన్‌లైన్ వేదికల ద్వారా తమ అభ్యసన కార్యక్రమాలను కొనసాగించేలా విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా వీటిని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఎస్‌సీఈఆర్‌టీ శ్రీకారం చుట్టింది.























