రైళ్లు వస్తున్నాయ్‌..!

0
244

సుమారు 52 రోజుల విరామం తర్వాత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రైళ్ల రాకపోకలకు సన్నద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. న్యూఢిల్లీ నుంచి బెంగళూర్, బెంగళూర్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రెండు ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో బుధవారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. ఈ రైళ్లలో దాదాపు 300 మంది నగరానికి చేరుకోనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నగరానికి చేరుకోనున్న వారితో పాటు ఇక్కడి నుంచి బయలుదేరనున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here