వెంకటేష్ మరియు నాగచైతన్యలు కలిసి నటించిన ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ చిత్రంకు యాంటీ క్లైమాక్స్ ఉంటుందని, వెంకటేష్ చనిపోతాడంటూ ప్రచారం జరుగుతోంది.కథానుసారంగా వెంకీ పాత్రను చంపేయడంతో పాటు నాగచైతన్య పాత్రకు క్లైమాక్స్‌లో ప్రత్యేకమైన పవర్‌ను క్రియేట్ చేయాల్సి ఉందట.కాని యాంటీ క్లైమాక్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు.అందుకే మొదట యాంటీ క్లైమాక్స్‌ను తీసిన దర్శకుడు బాబీ ఆ తర్వాత మరో క్లైమాక్స్‌ను కూడా షూట్ చేసి పెట్టాడట.
రెండు క్లైమాక్స్‌లలో ఎది బెటర్ అనే విషయమై సురేష్‌బాబు చర్చలు జరుపుతున్నాడు.ఈ చిత్రానికి ఒక నిర్మాత అయిన సురేష్‌బాబు దర్శకుడు బాబీ మరియు రచయితలో చర్చలు జరుపుతున్నాడు.ఇద్దరు హీరోలు ఉన్నారు కనుక ఒక హీరో చనిపోయినా పర్వాలేదు మరీ ఎక్కువగా ప్రభావం ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మరో వైపు వెంకటేష్ పాత్రను చంపేయడం వల్ల సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా అంటున్నారు.
క్లైమాక్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేప్పటి వరకు సినిమాను అలా వాయిదా వేస్తూనే ఉండాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.నవంబర్ లేదా డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్న చిత్ర యూనిట్ సభ్యులు అప్పటి వరకు క్లైమాక్స్ విషయంలో ఫుల్ క్లారిటీకి రావాలని భావిస్తున్నారు.
ఎన్నో చిత్రాలను నిర్మించిన అనుభవం ఉన్న నిర్మాత సురేష్‌బాబు ఈ చిత్రం విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు.అనేక రకాల ఆలోచనలతో ఆయన అటు ఇటు అవుతున్నట్లుగా తెలుస్తోంది.చివరకు ఏ క్లైమాక్స్‌ను ఉంచుతారో చూడాలి.




























