ఆ పాత్రపై మనసు చంపుకున్న మెగాస్టార్….

0
195

ప్రతి నటుడికి మరియు నటికి డ్రీమ్‌ రోల్స్‌ అంటూ ఉంటాయి.కొందరికి ఒక్కటి ఉంటే కొందరికి చాలా ఉంటాయి.చిరంజీవికి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించాలని చాలా కాలంగా కోరిక.అది ఆయన డ్రీమ్‌ రోల్‌గా చెబుతూ వచ్చేవాడు.భగత్‌ సింగ్‌ పాత్రలో నటించాలనే కోరిక కెరీర్‌ ఆరంభంలో చాలా ఉండేదని చిరంజీవి చెప్పుకొచ్చాడు.ఇప్పుడు చిరంజీవి సైరా చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు.

భగత్‌ సింగ్‌ పాత్రను చేయలేక పోయినా కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.ఇక మీ టార్గెట్‌ భగత్‌ సింగ్‌ పాత్రనేనా అంటూ మీడియా వారు ప్రశ్నించిన సమయంలో చిరంజీవి ఆసక్తికర సమాధానం చెప్పాడు.ఇలాంటి పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం అసాధ్యం.భగత్‌ సింగ్‌ పాత్రను చేను చేయలేను.నేను చేయలేక పోయిన ఆ పాత్రను చరణ్‌ చేస్తే చూడాలని ఉంది.చరణ్‌కు ఆ ఛాన్స్‌ రావాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం చరణ్‌ స్వాతంత్య్ర సమయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో పోషిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో రామ్‌ చరణ్‌ పాత్ర ఎలా ఉంటుందా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జక్కన్న ఖచ్చితంగా చరణ్‌లో అల్లూరి సీతారామరాజును చూపిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.అల్లూరి సీతారామరాజు పాత్ర తర్వాత చరణ్‌ భగత్‌ సింగ్‌ పాత్రను తండ్రి కోరిక మేరకు చేస్తాడేమో చూడాలి.