‘మామాంగం’ టీజర్‌ చూశారా…. ఆయనలాంటి యోధుడు లేడు.. ఇక రాడు..!

0
201

‘మన సంప్రదాయం బానిసలా బతకడం కాదు..’ అని అంటున్నారు మాలీవుడ్‌ స్టార్‌ ఉన్ని ముకుందన్‌. ఆయనతోపాటు సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘మామాంగం’. ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. శనివారం తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ‘మామాంగం’ అనే మహా ఉత్సవం ప్రాముఖ్యం తెలుపుతూ టీజర్‌ ఆరంభమైంది. ఇండియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పుట్టిన గడ్డ కేరళ వెనుకన్న కథను తెలుపుతూ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ‘మన సంప్రదాయం బానిసలా బతకడం కాదు.. ఓ గొప్ప యోధుడిలా వీర మరణం పొందడం’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘మన చరిత్రలో మునుపెన్నడూ తనలాంటి యోధుడు లేడు.. ఇక రాడు..’ అంటూ మమ్ముట్టి సాహసాన్ని వర్ణించే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఎమ్‌.

పద్మకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌. జయచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.