ఢిల్లీ కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం భావన ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలో మంటలు రావడంతో ఆందోళన రేగింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనాస్థలానికి 14 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలలను ఆర్పుతున్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని 29 ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో భావన కారిడార్ ఒకటిగా ఉంది. కాగా గురువారం తెల్లవారుజామున దర్యాగంజ్ సమీపంలోని ఒక వస్త్ర దుకాణానికి చెందిన ఒక గోడౌన్‌లో మంటలు చెలరేగి బాగానే ఆస్తి నష్టం సంభవించింది.























