“జీడిపప్పు, బాదం పప్పు” పేరు చెబితేనే నోరూరుతుంది కదా! మరి తింటే ఎన్ని లాభాలో ఒకసారి చదివేయండి..!

0
318

ఆరోగ్యంగా ఉండాలంటే ఏవేవో కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార మార్పులు జీవన మార్పులు చేసుకుంటే సరి. అందులో భాగంగానే కొన్ని గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తాజా పరిశోధనల ప్రకారం, గింజలు అంటే సోయా, పప్పులు, చిక్కుళ్లు ఇలా ప్రోటీన్స్‌తో నిండిన ఆహారం తీసుకుంటే జీవన ప్రమాణాలు పెరిగినట్లు తేలింది. సుమారు 20 ఏళ్లపాటు 70వేల మందికి పైగా పరిశీలించిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. శాకాహారంతో లభించే మాంసకృత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మరణించే రేటు 13 శాతం తగ్గుతుందని తేల్చారు. వృక్ష సంబంధ ప్రోటీన్లు తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా జీవనప్రమాణాలు మెరుగుపడతాయని, ఆరోగ్యంగా ఉంటామని గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 16శాతం తగ్గుతాయని తేల్చారు.. దీంతో పాటు మాంసాహారం కూడా తగ్గించడం మంచిది. అయితే, అదికేవలం ఎక్కువగా మాంసాహారం తినేవారు తగ్గించాలి. ఇలా చేయడం వల్ల అన్ని కారణాలతో సంభవించే మరణం ముప్పు 34శాతం తగ్గుతుంది. క్యాన్సర్ మరణాల ముప్పు 39 శాతం, హృదయ సంబంధిత మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుంది. అంతేకాదు.. గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా అధికబరువు కూడా తగ్గుతారు. ఇందులోనూ ముఖ్యంగా సోయా తీసుకోవడం వల్ల అదనపు లాభాలుంటాయి. రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సోయా చక్కగా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఉన్న సోయా మిల్క్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అదే విధంగా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి..

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఆప్రికాట్స్, డేట్స్ వీటన్నింటిని కూడా నట్స్ కిందకే వస్తాయి. ఇందులో ఒక్కో నట్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్ మంచి న్యూట్రీషియన్స్ వాల్యూస్ కలిగి ఉంటాయి.