ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. కొంత మంది తిన్నా తినకపోయినా సరే అమాంతం బరువు పెరుగుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మారిన ఆహారపు అలవాట్లు, మారిన పరిస్థితులు వంటివి బరువు పెరగడానికి కారణంగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలూ అయితే రోజు రోజుకి పెరిగిపోతు ఆందోళన కలిగిస్తున్నారు. వాళ్ళు తినేది తక్కువ అయినా సరే వారి ఆహారపు అలావాట్లు, వ్యక్తిగత అలవాట్ల కారణంగా బరువు పెరుగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇక ఫోన్ నొక్కుతూ తెల్లవార్లు మెలుకవగా ఉంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటె… ఇక వారి వ్యక్తిగత అలవాట్లు బరువు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిద్రించడం, లేట్ గా లేవడం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై పరిశోధకులు ఆందోళన కర విషయాలను వెల్లడించారు. మీరు టీనేజ్ అమ్మాయా? రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? అయితే, మీరు త్వరగా లావు అవుతారని ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది.
దీని వివరాలను జామా పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించారు. దీని కోసం 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న 418 మంది బాలికలు, 386 మంది బాలురు పడుకునే సమయం, ఇతర అలవాట్లను పరిశోధకులు పరిశీలించారు. వారిలో రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం అలసటతో బాధపడే బాలికల బరువులో మార్పు వచ్చిందని వెల్లడించారు. ఒక్కగంట అలసట కారణంగా నడుము కొలత చదరపు మీటరుకు అత్యధికంగా 1.19 సెంటీమీటర్లు, బరువు 0.45 కిలోగ్రాముల చొప్పున పెరిగాయని తెలిపారు. కాబట్టి త్వరగా పడుకోవాలని సూచిస్తున్నారు.























