“కమ్మరాజ్యంలో కడపరెడ్లు” – ట్రైలర్ మాములుగా లేదుగా..!

0
254

నాకు నచ్చింది నేను తీస్తా.. ఇష్టముంటే చూడండి, లేకపోతే మానేయండి అనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అనేది లేకపోతే ఆయనకు అస్సలు నిద్ర పట్టదు. ఈ మధ్య కాలంలో ఆయనకు వివాదాల పిచ్చి మరీ ఎక్కువైంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అంటూ కాకరేపుతున్నారు.

ఇది వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. ఆయన చేసే ప్రచార కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఆ రోజు టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ను చూసిన తరవాత వర్మను తిట్టేవాళ్లు తిట్టారు, పొగిడే వాళ్లు పొగిడారు.

 

మీరైతే ట్రైలర్ పై ఓ లుక్ యేయండి..!