ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి. స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది.




























