లాక్‌డౌన్‌: మరో రెండు వారాలు…?

0
315

కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ గడువు మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వైరస్‌ కట్టడి కాకపోవడం, పాజిటివ్‌ కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడం వంటి అంశాల కారణంగా లాక్‌డౌన్‌ను మరికొన్నాళ్ల పాటు పొగించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో మే 31 చివరి వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించింది. తాజాగా లాక్‌డౌన్‌ను మరోరెండు వారాల పాటు పొడిగించాలని కోరుతూ అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here