సాహో.. ఆరోగ్య సేతు..

0
177

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులు అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా ఆరోగ్య సేతుకు అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్‌ ప్లే డౌన్‌లోడ్‌లో 5వ స్థానం లభించగా, ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌ డౌన్‌లోడ్స్‌లో 7వ స్థానం లభించడం విశేషం. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందిం చిన ఈ కరోనాట్రాకింగ్‌ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓ ఎస్‌ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. భారతీ యులను కరోనా నుంచి ఆరోగ్యం దిశగా పయ నింపజేసేందుకు ఉద్దేశించిన వారధి ఈ యాప్‌.. అందుకే, దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here