“షో” వెయ్యలేదని అభిమానుల బీభత్సం – “భారీ నష్టం-40 మంది అరెస్ట్”

0
174

తమిళనాట స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా వయోలెంట్ గా ఉంటారనే విషయం తెల్సిందే. అక్కడ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉంటూనే ఉంటాయి. ఆమద్య ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవ్వగా జరిగిన రచ్చ మామూలుది కాదు. ఈసారి దానికి మించిన రచ్చ తమిళనాట జరిగింది. విజయ్ తాజా చిత్రం ‘బిగిల్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రత్యేక షోలు వేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

సినిమా ప్రత్యేక షో లకు ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ సినిమా ప్రదర్శణ లేకపోవడంతో ఆవేశంతో ఊగిపోయారు. ముఖ్యంగా కృష్ణగిరిలో విజయ్ ఫ్యాన్స్ చేసిన రచ్చతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు కోట్లల్లో నష్టం వాటిల్లింది. రాత్రి సమయంలో షోకు అనుమతి లేదు అంటూ థియేటర్ ను క్లోజ్ చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ గేటును బద్దలు కొట్టుకుని థియేటర్ ను ద్వసం చేశారు.

ఆ తర్వాత థియేటర్ సమీపంలో ఉన్న షాపులను మరియు కనిపించిన వాహనాలను ఇష్టానుసారంగా బద్దలు కొట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో మరింత కోపంతో ఫ్యాన్స్ రెచ్చి పోయారు. పోలీసు వాహనాలతో పాటు మున్సిపాలిటీ వాహనాలను కూడా బద్దలు కొడుతూ నానా బీబత్సం చేశారు. స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ విజయ్ సినిమాకు అనుమతి ఇవ్వలేదు అనేది ఫ్యాన్స్ వాదన. ఆ వాదనతోనే రెచ్చి పోయారు.