ఈ దశ అత్యంత కీలకం!

0
289

కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సడలిం పులు, దశలవారీగా ఎత్తివేత చేపడుతున్న నేప థ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిం దని, ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని కొందరిలో ఏర్పడుతున్న భావన సరికాదన్నారు. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికి పాజిటివ్‌ లక్షణాలున్నాయనేది బయటపడక పోతుండటం వల్ల వారిని కరోనా పాజిటివ్‌లుగానే పరిగణిస్తూ మన వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన వారిలో 79% మంది వైరస్‌ లక్షణాలు కనిపించని (అసిమ్‌టమ్యాటిక్‌ కేసులు) వారేనని, 21% మంది లోనే ఈ లక్షణాలు బయటపడు తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో రెండింతల జాగ్రత్త చర్యలు తీసు కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వారు వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉండ టంతో, ఇది సోకకుండా కచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ సమస్య మరింత తీవ్రం కానుందని, వైరస్‌ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, న్యూమోనియా, గొంతు సమస్యలు వంటి కరోనా లక్షణాలు లేని వారిలోనూ పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయని, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, డయాబెటీస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలోనూ ఈ కేసులు బయట పడుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరి స్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశా లను ‘సాక్షి’ఇంటర్వూ్యలో శేషగిరిరావు వివరిం చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here