ఉపాధికి ఎసరు!

0
221

కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్‌ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో పడింది. లాక్‌డౌన్‌ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రభావం నుంచి చాలా నెమ్మదిగా కోలుకోవడంతో పాటు ఈ ప్రక్రియ బాధాకరంగా ఉంటుం దని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తక్షణ సహాయ కార్యక్రమాలు లేవంది. లాక్‌డౌన్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ అనియత, (ఇన్‌ఫార్మల్‌ సెక్టార్‌) తది తర రంగాల్లోని మూడింట రెండొంతుల మంది (67%) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్లు ఇందులో వెల్లడైంది. ఇది నగర, పట్టణ ప్రాంతాల్లో 80%గా, గ్రామీణ ప్రాంతాల్లో 57%గా ఉందని తేలింది. పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లేదా ఇతర రూపాల్లో పనిచేస్తున్న ప్రతీ పది మందిలో 8 మంది (80%), గ్రామీణ ప్రాంతాల్లో పది మం దిలో ఆరుగురు (57%) తమ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్లు ఈ పరిశీలనలో వెల్లడైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here