పాయల్ గ్లామరే సినిమాకు పెట్టుబడా…?

0
332

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన భామ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు బాగానే అవకాశాలు వచ్చాయి. అందులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంది.

అదే.. ఆర్డీఎక్స్ లవ్. పేరులోనే కాదు.. పాయల్ గ్లామర్‌ను ఎలివేట్ చేసే విషయంలోనూ ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’తో పోలికలు కనిపించాయి. పాయల్ గ్లామరే సినిమాకు పెట్టుబడి అనే తరహాలో ముందుగా ఒక టీజర్ వదిలారు. దాని నిండా ముద్దులు, ఇంటిమేట్ సీన్లు, బూతు డైలాగులే. టీజర్ మరీ చీప్‌గా ఉందన్న విమర్శలతో దానికి పూర్తి భిన్నంగా ట్రైలర్ వదిలారు. అది చూస్తే ఒక కాజ్ కోసం నడిచే ఉదాత్తమైన సినిమాలా కనిపించింది ‘ఆర్డీఎక్స్ లవ్’. ఆ టీజర్‌కు, ఈ ట్రైలర్‌కు పొంతనే లేకపోవడంతో ఇవి రెండూ ఒకే సినిమాకు సంబంధించినవేనా అని ఆశ్చర్యపోయారు.

ఐతే విడుదల ముంగిట ప్రమోషన్ల తీరు చూస్తే మాత్రం పాయల్ అందాల్ని ఎలివేట్ చేస్తూ కుర్రాళ్లను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా సాగింది. మరి వాళ్లు ఏ మేరకు థియేటర్లను నింపుతారన్నది ఈ రోజు తేలిపోతుంది. టీజర్‌లో ఒక రకంగా, ట్రైలర్‌లో ఒక రకంగా కనిపించిన ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమాగా ఎలా ఉంటుందన్న ఆసక్తి జనాల్లో ఉంది. కేవలం అందాల్ని నమ్ముకుని ఈ రోజుల్లో సినిమాల్ని ఆడించే పరిస్థితి లేదు.

కంటెంట్ క్రేజీగా ఉండాలి. అలాగే సందేశాలు ఇస్తే, సమస్యలు-పోరాటాలు అంటే జనాలు అసలే చూసే పరిస్థితి లేదు. మరి ఈ అంశాల్ని ‘ఆర్డీఎక్స్ లవ్’లో ఎలా బ్యాలెన్స్ చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తారో చూడాలి. ఏదేమైనా కూడా ఈ సినిమాకు ఆకర్షణ పాయలే అనడంలో సందేహం లేదు. ‘సైరా’ ఇంకా బాగా ఆడుతున్న నేపథ్యంలో పాయల్ తన సత్తాను ఏమేరకు చూపిస్తుందో మరి.