పిట్టల్లా రాలిపోతున్న చిన్న తరహా పరిశ్రమలు! దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందా?

0
182

దేశంలో దరిద్రం తాండవిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తే చాలా మందికి అలా ఎందుకు అంటున్నారో అర్ధం కాలేదు. దానికి తోడు ఎన్నడు లేని విధంగా బిజెపి 303 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. దీనితో దేశంలో అంతా మంచే జరుగుతుందని భావించారు. అయితే కీలకమైన అభివృద్ధి, సంక్షేమం ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మాత్రం ఎవరూ గమనించలేదు. కేవలం మోడీ పన్నిన భావోద్వేగాల ఉచ్చులో చిక్కుకుని ప్రజలు ఎన్డీఏ కి ఓట్ల వర్షం కురిపించారని, దానికి ఎన్నికల సంఘం ఏకపక్షంగా సహకరించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా బిజెపి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే చాలా మంది ప్రజల్లో మాత్రం తమ జీవితాలు మోడీ పాలనలో నాశనం అయ్యాయి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. మోడీ చెప్పేవి కథలు మాత్రమే అనే భావన ప్రజల్లో ఎక్కువగానే ఉంది. ఇక మీడియా కూడా మోడీ ఒక ధీరుడు, సూరుడు అని విధంగా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది అనేది వాస్తవం.

ఆయన చేస్తున్న పనుల గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేకుండా కేవలం అర్ధంలేని చర్చలను పెట్టి ప్రజల దృష్టిని మళ్ళించింది బిజెపి. అయితే చాలా రంగాలు మోడీ నిర్ణయాల కారణంగా కుదేలు అయ్యాయి అనే విషయాన్ని మాత్రం మీడియా ఎక్కడా కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఇప్పటికి చాలా మంది నష్టాల ఊబిలో కూరుకుపోయారు అనేది వాస్తవం. ఆ నిర్ణయం కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర నష్టాల పాలు అయ్యాయి అనేది వాస్తవం. కీలకమైన వ్యాపార వ్యవస్థలు కూడా ఈ నిర్ణయం తో మూతపడ్డాయి. ఇప్పటికి ఆరోజు అప్పుల పాలు అయిన వాళ్ళు అప్పులు, దానికి వడ్డీలు కడుతూనే ఉన్నారు. నిరర్ధక ఆస్తులు పేరుకు పోవటంతో బ్యాంకులు దివాళాకి దగ్గరలో ఉన్నాయి.

తీసుకున్న రుణానికి మూడు నెలల పాటు ఎటువంటి కిస్తీలు కట్టకపోతే వాటిని నిరర్ధక ఆస్తులుగా భావించి, ఋణం తీసుకున్న వారి ఆస్తులు వేలం వేయటం, అటువంటి ఆస్తులని అతి తక్కువ ధరకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తన్నుకుపోవటం గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. ఇక భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక రంగంగా ఉన్న వ్యవసాయం నేడు కష్టాలతో నడుస్తుంది. రైతులకు రుణ భారం పెరిగిపోవడం అప్పుల పాలు కావడం వంటివి జరిగాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంటను నాశనం చేసుకుని నేడు కూటికి లేక కాటికి కాళ్ళు జాపే పరిస్థితి వచ్చింది. దేశంలో 96 శాతం రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు … ఆర్ధిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది. ఇలా దేశ ఆర్ధిక రంగానికి కీలకమయిన చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయం రంగం వంటివి నాశనం కావడంతో ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకి భారీగా పతనం అవుతుందని ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.