పాలన గాలికి.. కక్ష సాధింపే ధ్యేయంగా ‘వై ఎస్ జగన్’…

0
185

రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి.. కక్ష సాధించడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె… గత నాలుగు నెలలుగా అన్ని రంగాల్లో మహిళల్ని వైసీపీ ప్రభుత్వం అవస్థలకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. గృహిణుల నుంచి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీ మహిళా నాయకులపై మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.

రాయలసీమలో ఎంతో కీర్తి కలిగినటువంటి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధించడం కోసం ఆమె భర్తపై కేసులు పెడుతోందని ఆమె ఆరోపించారు. అఖిల ప్రియ భర్తకు సంబంధించిన వ్యాపారంలోని భాగస్వామి కార్మికులను కొట్టారనే నెపంతో కేసు పెట్టారని… కార్మికులను కొట్టినట్లైతే వారు కేసు పెట్టాల్సింది పోయి.. ఎవరో బయటి వ్యక్తులు కేసులు పెట్టడమేంటని నిలదీశారు. అక్కడ ఏమీ జరగకపోయినా.. వైసీపీ నేతల మద్దతుతో కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నిజంగా అక్కడ ఏదైనా జరిగినా.. సివిల్ కేసు నమోదు చేయాలన్నారు. కానీ క్రిమినల్ కేసుగా 307 సెక్షన్ కింద నమోదు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అఖిల ప్రియ భర్త ఒక ఐఐటీ విద్యార్థి, అమెరికాలో గౌరవ ప్రదమైన ఉద్యోగం చేసి ఇక్కడికొచ్చిన వ్యక్తన్నారు. జగన్మోహన్ రెడ్డిలా పదుల సంఖ్యలో కేసులు లేవన్నారు. అలాంటి వ్యక్తిపై కర్నూలు సహా హైదరాబాద్ లో కేసులు పెడుతున్నారన్న ఆమె వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మహిళా ఎంపీడీవో సరళ ఐదు పేజీలతో కూడిన ఫిర్యాదు లేఖ రాశారని… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్యం సేవించి రావడం, హతమారుస్తామని బెదిరించడం, కుటుంబ సభ్యులను హెచ్చరించడం,

వంటి అన్ని విషయాలను లేఖలో పేర్కొన్నారన్న ఆమె ఊరిలో చనిపోయిన పాములు, కుక్కలు, పిల్లుల్ని మీ ఇంట్లో పడేస్తామని ఇంటికొచ్చి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఇంతటి తీవ్రమైన ఘటనలో జైలుకు తీసుకెళ్తే.. ఏం హామీలిచ్చారో తెలియదు కానీ.. గంటలలో బయటకొచ్చారన్నారు. బయటికొచ్చిన వెంటనే ఇసుక నుంచి అన్ని విషయాల్లో జరిగే అవినీతి సంపాదనను ఎవరు ఎంత పంచుకోవాలో చెబుతూ పంచాయతీ పెట్టారని… సుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి మీరు పంచాయతీ పెట్టుకోవద్దు.. నేను చూసుకుంటా. ఇదా పరిపాలన.? అని ఆమె ప్రశ్నించారు.