ఈ విషయంలో బాలయ్యని మించిన యాక్టర్ లేడు….

0
233

నందమూరి బాలకృష్ణ గురించి ఒక విషయం చెప్పాలనిపిస్తుంది..! ఆయన గురించి, ఆయన సినిమాల గురించి కొందరు ఎప్పుడూ వ్యతిరేకించడమో, కించ పరచడమో చేస్తూ ఉంటారు…! ఆయన గురించి నేను స్వయంగా ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి… బాలకృష్ణతో పరమవీర చక్ర సినిమాకు పని చేసిన వ్యక్తి చెప్పిన మాట…! “ ఆ సినిమా ఎలా తీశాడన్నా…?” అని నేను అడిగితే… అలాంటి నటుడ్ని “డైరెక్టర్స్ యాక్టర్, ప్రొడ్యూసర్స్ యాక్టర్, యాక్టర్స్ యాక్టర్, కంప్లీట్ సినిమా యాక్టర్ అంటారు తమ్ముడూ… సినిమా కథ, కథనం ఎలా ఉందో కూడా ఆయన చూడడు…

దర్శకుడు అడిగింది చేస్తాడు… అందుకే కొన్ని బాలకృష్ణ సినిమాలు బాలకృష్ణ అభిమానులకే నచ్చుతాయ్… బాలయ్య ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు, కథ ఫెయిల్ అవుతుంది గాని… అందుకే అల్లరి పిడుగు, మహారధి లాంటి సినిమాలు ఫ్లాప్‌లు అయ్యాయి. దర్శకుడు ఏది అడిగినా సరే ఆయన కాదనడు…! అందుకే అల్లరి పిడుగులో డైరెక్టర్ బుల్లెట్ ని నోటితో విసరమంటే విసిరాడు, లక్ష్మీనరసింహా సినిమాలో ఇడ్లీలో బీర్ పోసే ఆ డైలాగ్ చెప్పాడు…! ఆయనకు సినిమా తెలుసు… కానీ కలెక్షన్లు తెలీదని వివరంగా చెప్పాడు…! బాలయ్య సినిమాతో వ్యాపారం చెయ్యడు…!

ఈ ఫొటో చూడగానే నాకు ఆ మాటలే గుర్తొచ్చాయ్… తెలుగు సినిమా ఉన్నన్ని రోజులూ నువ్వూ మీ నాన్న శిఖరాలు అంతే…! జై బాలయ్య… జైజై బాలయ్య…!” ఇటీవల బాలకృష్ణకు సంబంధించి విడుదలైన తాజా చిత్రంలోని ఫోటోని ఉద్దేశించి ఆయన అభిమాని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇది. ఇందులో అభిమాని ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు… వాటిని ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు, కొందరు నటులు కూడా సమర్ధించడం గమనార్హం. బాలకృష్ణ దర్శకుడు చెప్పింది చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడరని అంటూ… ఆయన సినిమా చేసే ముందు డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి కాదని గతంలో తాను సినిమా చేసిన నిర్మాత, దర్శకుడు అయితే ఆ సినిమా ఫ్లాప్ అయి డబ్బులు పోతే మళ్ళీ సినిమా అడిగితే ఆయన చేయడానికి సిద్దపడతారని… అలాంటి వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడుతున్నారు. బాలకృష్ణ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఎప్పుడు చూసే వ్యక్తి కాదని అందుకే తక్కువ డబ్బుతో సినిమాలు చేస్తూ కేవలం నిర్మాతల కోసమే ఆయన ఆలోచిస్తారని… ఇతర హీరోల మాదిరి ప్రతీ ఖర్చు నిర్మాత మీద వేయరాని, షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేయడానికే ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు అంటున్నారు.