సెప్టిక్‌ ట్యాంకులను కూడా వదలకండి.. దేవినేని ఉమా ఫైర్….

0
167

ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశాడు.ఏపీ ప్రభుత్వం హయాంలోని పథకాలను పేర్లు మార్చి మళ్లీ వాటిని కొత్త వాటిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ నాలుగు నెలల్లో ఏమాత్రం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని, ఏ ఒక్కటి కూడా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదంటూ మాజీ మంత్రి ఆరోపించారు.

పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్నట్లుగా వైకాపా ప్రభుత్వం పని తీరు ఉందని ఆరోపించాడు.ఈ సందర్బంగా ఆయన ఇంకా మాట్లాడుతూ ముందు ముందు సెప్టిక్‌ ట్యాంకులకు కూడా వైకాపా రంగులు వేసి తామే కట్టించామని గొప్పలు చెప్పుకుంటారేమో అంటూ ఎద్దేవ చేశారు.

గ్రామాల్లోని గ్రామ సచ్చివాలయాలకు వైకాపా రంగు వేయడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.గ్రామ సచ్చివాలయాలు గతంలో ఉన్నా కూడా ఇప్పుడు తామే కొట్టించామంటూ గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అంటూ దేవినేని ఉమ ఎద్దేవ చేశాడు.ప్రభుత్వం ఇకపై అయిన ప్రజల బాగు గురించి ఆలోచించాలని దేవినేని డిమాండ్‌ చేశాడు.