దసరాకు వెళ్ళిన కొడుకు మాయం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం..

0
182

ఆవేశంలో కొడుకును చంపాడో తండ్రి. మృతదేహాన్ని ఇంటి సమీపంలో బోరుబావి వద్ద పూడ్చిపెట్టాడు. మెద్‌జిల్లా, చేగుంట మండలం, ఇబ్రహీంపూర్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోమాండ్ల నారాయణరెడ్డి ఇబ్రహీంపూర్‌ సొసైటీ చైర్మన్‌గా ఉన్నారు. అతడికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు శ్రావణ్‌ కుమార్‌రెడ్డి(23) హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. దసరా పండగకు ఇంటికి వచ్చిన అతడు సోమవారం రాత్రి నుంచి కనిపించకుండాపోయాడు. కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా… తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరగగా నారాయణరెడ్డి శ్రావణ్‌కుమార్‌రెడ్డి గొంతు పిసికి చంపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నారాయణరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫొరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో మృతదేహాన్ని శుక్రవారం బయటకు తీయనున్నారు.