రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడినందున కేంద్ర సహకారం కావాలి. ఆరోగ్య రంగానికి, ఎంఎస్‌ఎంఈలకు ఊతమివ్వాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుంది. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిని సమాజం వేరుగా చూస్తుందన్న భావన నెలకొంది. వివక్ష కనిపిస్తోంది. దీనిని పోగొట్టేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. లక్షణాలు కనిపించిన వారు స్వయంగా ముందుకు వచ్చి వైద్యం పొందేలా చూడాలి. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమని, 85 శాతం కేసుల్లో మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయని తెలియజెప్పాలి. కరోనాకు వ్యాక్సిన్ కనుక్కునే వరకు దాంతో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై మరింత అవగాహన కల్పించాలి.























