భారత్ ఆత్మ నిర్భర్ యోజన ప్రభుత్వ అంగాలకు, ప్రజలకు స్వావలంబన సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంది. శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ పనులు వేగంగా నాణ్యతతో, పారదర్శకతతో జరిగితే ప్రధాని ఆకాంక్షించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు అందరూ సంకల్పం చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలం. మేకిన్ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేలా ఉంది.
























As someone who loves dress codes, solid overview — great resource overall.