“హాల్లో సిరి” అనే ముందు జాగ్రత్త…!

0
222

“హాల్లో సిరి” కాల్ రాకేశ్… “హే ఓపెన్ వాట్సాప్” అంటూ యాపిల్ వినియోగదారులు సందడి చేస్తూ ఉంటారు. ఆపిల్ ఫోన్ లో ఉండే ఈ యాప్ కి ఎందరో ప్రియమైన వినియోగదారులు ఉన్నారు. బిజీ లైఫ్ లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. కారులో ఉన్నప్పుడో లేదా ట్రాఫిక్ లో ఉన్నప్పుడో సిరిని ఎక్కువగా వాడుతూ ఉంటారు వినియోగదారులు. అయితే దీని కారణంగా సమస్యలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. మనకి సంబందించిన సమాచారాన్ని… అది కూడా కీలక సమాచారాన్ని, మన వ్యక్తిగత విషయాలను సిరి దొంగలిస్తుందని తాజాగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ఐరిస్‌ ఎగ్జామినర్‌ అనే సంస్థ గత వారం వెల్లడించిన కథనం ఆధారంగా చూస్తే… మాటలను అర్థం చేసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకునే యాపిల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’… వినియోగదారుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా రికార్డు చేస్తున్నట్టు, వాటిని సంస్థ ఏజెంట్లు వర్గీకరిస్తున్నట్టు ఐరిస్‌ ఎగ్జామినర్‌ పేర్కొంది. వ్యక్తులు ఇచ్చే ఆదేశాలతో పాటు వారి ఆరోగ్య, ఔషధాల వివరాలు, వ్యాపార రహస్యాలు, శృంగార వ్యవహారాలను కూడా సిరి రికార్డు చేస్తోంది. ‘హే సిరి’ అనే కమాండ్‌ ఇవ్వకపోయినా… కొన్ని సారూప్య శబ్దాలకు సిరి యాక్టివేట్‌ అవుతోంది.

ఆ సమయంలో అక్కడి సంభాషణలను అది నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్‌ ఏజెంట్లు వీటిని తరచూ విని, విశ్లేషి౦చడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే ఆపిల్ నష్ట నివారణ చర్యలకు దిగింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా… సిరి రికార్డింగుల వర్గీకరణను యాపిల్‌ నిలిపేసింది. తమ వినియోగదారుల గోప్యతను పరిరక్షిస్తామని, సిరి రికార్డింగ్‌ల వర్గీకరణ కార్యకలాపాలను నిలిపివేశామని యాపిల్‌ వర్గాలు చెప్పినట్టు ఐరిస్‌ ఎగ్జామినర్‌ ఉటంకించింది. దీనితో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.