అందరి జాతకాలు నాకు తెలుసు.. విశాఖలో బాబు సంచలన వ్యాఖ్యలు !!

0
201

విశాఖలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసులు, ప్రభుత్వం లక్ష్యంగా ఆయన ఆరోపణలు చేసారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ రౌడీ గవర్నమెంట్ నడుస్తోందని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.

కొంత మంది పోలీసులు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారని, పోలీసులకు ఎందుకు ఈ అత్యుత్సాహమని, ఈ సమావేశం దగ్గర కూడా పోలీసులు ఎక్స్‌‌ట్రా వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైఎస్‌లాంటి ఒక వ్యక్తి.. తాను అసెంబ్లీలో మాట్లాడితే భయపడేవారని, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 4 నెలల తర్వాత తాను విశాఖకు వస్తే.. స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. ఒక్కడి జాతకం తనకు తెలుసన్న చంద్రబాబు ‘మీరు మంచిగా ఉంటే.. నేను మంచిగా ఉంటా?’, తమాషాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.

మా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన చంద్రబాబు సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ డీజీపీ పట్టించుకోలేదని అదే వైసీపీ నేతలు వెళ్తే మాత్రం వారికి రెడ్ కార్పెట్ వేశారన్న చంద్రబాబు ఎవరేం చేస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుని ఉంటానన్నారు. ‘జగన్ ఓ నేరస్తుడు.. ఆ నేరస్తుడు చెబితే మీరు రెచ్చిపోతారా?’ అని నిలదీశారు. ఎవరి హద్దుల్లో వారుండాలన్నారు. అవసరమైతే పోలీసులు వైసీపీలో చేరి పోటీచేయాలని హితవు పలికారు. తానెవరికీ భయపడే వ్యక్తిని కాదన్న చంద్రబాబుతాను పిరికివాడిని కాదన్నారు. అలాంటిది మీ బెదిరింపులకు భయపడే వాడిని కాదని, తాను ఎంతకైనా తెగించి కార్యకర్తలను కాపాడుకుంటానని స్పష్టం చేసారు.