టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత అమ్మాయిలు..!

0
173

భారత మహిళలు మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఐదు టి20ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో టి20లో భారత్‌ 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై విజయం సాధించింది. వర్షం వల్ల ఆలస్యమైన ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ముందుగా భారత్‌ 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా… భారత స్పిన్‌ వలలో పడింది. 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్లు పూనమ్‌ (3/13), రాధాయాదవ్‌ (2/16) సఫారీని కట్టడి చేశారు. తొలి టి20 భారత మహిళలు గెలుపొందగా… తర్వాత రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఆఖరి టి20 ఇక్కడే 4వ తేదీన జరుగనుంది.