పృద్వీని సినీ పరిశ్రమ బ్యాన్ చేస్తుందా…?

0
412

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలా వరకు రాష్ట్రంలో సందడి చేస్తూ వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది సిని రంగమే. చంద్రబాబు మీద వాళ్లకు ఏదో వారసత్వ శత్రుత్వం ఉన్నట్టు ప్రవర్తించిన కొందరి తీరు అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది అంతంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా పరిశ్రమలో పెద్ద అవకాశాలు లేక ప్రేక్షకులు మర్చిపోయిన నటులు అందరూ చంద్రబాబు మీద అవమానకరంగా, ఏకవచనంతో సంభోదిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద భయమో లేక సినీ అవకాశాలు లేక రాజకీయ అవకాశాల కోసం జగన్ ని ఖుషీ చేయాలన్న ఉద్దేశంతోనే అప్పుడు చంద్రబాబు మీద తీవ్ర విద్వేషపూరిత విమర్శలు చేశారు.

ఎప్పుడూ లేనిది వారందరూ ఒకేసారి ఎన్నికల సమయంలో కండువాలు కప్పుకుని రోడ్ల మీదకి రావటం ప్రజలకి ఆశ్చర్యం కలిగించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకునే క్యారెక్టర్ పృథ్వీ. మరి ఈయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు గాని, రాజకీయ విమర్శలు ఎక్కువగానే చేశారు. ప్రధానంగా చంద్రబాబుని, మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేసిన సంగతి ప్రజలకి గుర్తుండే ఉంటుంది. సిని రంగంలో ఉన్నారు కాబట్టి ఆయన విమర్శలకు కాస్త ప్రాధాన్యత కూడా ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆయనకు అదే సిని రంగం దాదాపుగా చుక్కలు చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆయనకు అవకాశాలు రావడం ఇప్పుడు కష్టంగా మారింది.

మెగా ఫ్యామిలీ నటించే సినిమాల్లో ఆయన తప్పకుండ కనిపించే వారు… ఇప్పుడు అవకాశాలు రావడం లేదని అంటున్నారు. మెగా హీరోలు ఆయనను అసలు దగ్గరకి కూడా రానివ్వడం లేదని ఇతర హీరోల సినిమాలకు కూడా ఆయననను ఎంపిక కానివ్వడం లేదని అంటున్నారు. ఇటీవల త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఒకటి మొదలయింది. త్రివిక్రమ్ సినిమా అంటే పృద్వీకి తప్పనిసరిగా అందులో ఒక మంచి పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయనకు అవకాశం దక్కుతుందని భావించినా అది జరగలేదు. అల్లు అర్జున్ అతన్ని అంగీకరించలేదని అంటున్నారు. ఇక ఇతర మెగా హీరోలు సైతం ప్రిథ్విని వీలైనంత దూరంగా ఉంచుతున్నారని సమాచారం. సినీ పరిశ్రమలో అవకాశాలు లేకపోయినా ప్రభుత్వ ఛానెల్ అయినా భక్తి టీవీ కి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం పృథ్విని నియమించిన విషయం తెలిసిందే.