రికార్డు స్థాయిలో తొలి రోజే రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు

0
211

తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.150 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7(గురువారం)నుంచి తిరిగి ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్‌ జోన్లు మినహా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలోనూ లిక్కర్‌ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్‌ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here