ఆయన అందుకే కేసీఆర్‌ ముందు తల వంచారా?

0
169

కాంగ్రెస్‌ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఫైర్‌ బ్రాండ్‌గా మంచి గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే.ఆయన కేసీఆర్‌ మరియు టీఆర్‌ఎస్‌ నాయకులపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో హీట్‌ను పెంచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంతటి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొన్నాళ్లుగా సైలెంట్‌ అయ్యాడు.హరీష్‌ రావుతో సుదీర్ఘ రాజకీయ వైరంను పక్కన పెట్టి నియోజక వర్గం కోసం ఇకపై కలిసి పని చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

నేడు మరోసారి జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.నియోజక అభివృద్ది కోసం కేసీఆర్‌ ముందు తల వంచుతున్నట్లుగా ప్రకటించాడు.ప్రభుత్వంలో ఉన్న పార్టీతో ఢీ కొట్టడం వల్ల నియోజకవర్గం అభివృద్ది సాద్యం కాదని అందుకే ఇకపై కేసీఆర్‌పై కాని టీఆర్‌ఎస్‌ నాయకులు మరియు మంత్రులపై విమర్శలు చేయన్నాడు.నేను మాత్రమే కాకుండా ఎవరు కూడా టీఆర్‌ఎస్‌పై కేసీఆర్‌పై విమర్శలు చేయవద్దని ఆయన అన్నాడు.

అలాగే బీజేపీ విషయంలో కూడా ఇదే వ్యవహారంను అవలంభించాలని ఆయన తన కార్యకర్తలను ఆదేశించారు.