విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగలేదని, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ మేరకు కొంత బిల్లు పెరగవచ్చు కానీ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. కరోనా విపత్తు నియంత్రణకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా కష్టపడుతున్న వేళ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడలోని రహదారులు–భవనాల శాఖ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం మీడియాతో మాట్లాడారు
























I found this incredibly useful, thank you.