“మైసూరు నుండి నెదర్లాండ్” చేరిన “ప్రేమ-పెళ్లి”..!

0
187

ప్రేమకు భాషలు,ప్రాంతాలు అడ్డుకాదని మైసూరు చెందిన యువతి, నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువకుడు ఏడడుగులతో ఒక్కటై నిరూపించారు. మైసూరుకు చెందిన అను అనే యువతి కొంతకాలం క్రితం ఎల్‌ఎల్‌ఎం చదవడానికి నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అక్కడ పరిచయమైన నెదర్లాండ్స్‌ యువకుడు రెనె వ్యాన్‌ బోర్గెట్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ తల్లితండ్రులకు తెలియజేయగా, ఇరు వైపులా పెద్ద మనసుతో అంగీకరించారు. కుటుంబంతో కలిసి మైసూరుకు చేరుకున్న వరుడు రెనె సోమవారం తల్లిదండ్రులు,బంధువులు,స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం అనుకు మూడుముళ్లు వేశారు.