100 కోట్ల క్లబ్ కు చేరువలో “ఖైదీ”..!

0
187

కార్తి గత చిత్రాలు ఆశించిన స్థాయిల సక్సెస్‌ కాకపోవటంతో ఖైదీపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లేమీ దక్కలేదు. తొలిరోజు 3.5 కోట్లు వసూళ్లు చేసిన ఖైదీ రెండో 2.8 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి. మూడో రోజు 4.7 కోట్లు సాధించిన ఈ సినిమా తొలి వారాంతానికి కేవలం తమిళనాడులోనే 11 షేర్‌, 25 కోట్ల గ్రాస్‌ సాధించినట్టుగా ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఖైదీ తొలి పది రోజుల్లో 70 కోట్లకు పైగా గ్రాస్‌ సాదించింది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్ల మార్క్‌ను దాటినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి 100 కోట్ల మార్క్‌ను కూడా ఈజీగా అందుకోవటం కాయంగా తెలుస్తోంది. ఖైదీకి పోటిగా రిలీజ్‌ అయిన విజయ్‌ బిగిల్‌ ఇప్పటికే వసూళ్లు విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విజయ్‌, అట్లీ కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్‌ చేయటంతో బిగిల్ ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.