మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!

0
247

కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో చోటు చేసుకున్న యూపీ విషాద ఘటన, వలస  కార్మికుల దుర్మరణంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై సమాజంలో మనందరం  సిగ్గుతో తలదించుకోవాలంటూ విచారాన్ని వ్యక్తం చేశారు.

మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వలస కార్మికులను మనమే మాయం చేశాం. దీనికి సమాజంలోని మనం అందరమూ బాధ్యులమే. ముఖ‍్యంగా చిన్నా పెద్దా వ్యాపారస్థులందరమూ సిగ్గు పడాలి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అంతేకాదు వలస కార్మికుల సమస్యల స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలని మహీంద్రా గ్రూపును కోరారు. వారికి ఎలా సహాయపడగలమో సూచించాలన్నారు. తద్వారా బాధిత కుటంబాలను ఆదుకోవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here