కండక్టర్‌ లెస్‌ సర్వీసులు..

0
297

సరికొత్త మార్పులకు అనుగుణంగా కండక్టర్‌లెస్‌ సర్వీసులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. దీంతో వారు బస్సుల్లో కాకుండా బస్టాపుల్లో ఉండి టికెట్లు ఇస్తారు. ప్రతి బస్టాపునకు ఇద్దరు చొప్పున రెండు విడతలుగా విధులు నిర్వహించనున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు రెండు వైపులా 60 బస్టాపులు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేందుకు 120 మంది కండక్టర్లు అవసరం. ఇలా ఎంపిక చేసిన ప్రతి రూట్‌లో ఉన్న బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా కండక్టర్లను ఏర్పాటు చేసి టికెట్ల జారీ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ‘దీనివల్ల ప్రయాణికుల మధ్య, సిబ్బంది మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుకలుగుతుంది. పైగా మాస్కులు ఉన్న వారికే కండక్టర్లు టికెట్లు ఇస్తారు. వారు మాత్రమే బస్సెక్కుతారు. మరోవైపు ఏ బస్టాపులో ఎంతమంది ప్రయాణికులు ఎక్కారనే దానిపై కూడా ఒక నిర్దిష్టమైన అంచనా ఉంటుంది’ అని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో చెప్పారు. డిపోల్లోంచి బయలుదేరే ప్రతి బçస్సునూ పూర్తిగా శానిటైజ్‌ చేసి కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రోడ్డెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బస్సులు నడపడంతో పాటు ప్రయాణికులు, సిబ్బంది రక్షణ కూడా తమకు ఎంతో ముఖ్యమని, అందుకనుగుణంగానే బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here