దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటే దీన్ని పురస్కరించుకుని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన ఒక పోస్ట్ విమర్శల పాలైంది. ‘ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకు రావాలని కోరుతున్నా. ఈ దీపావళికి దీపాలు వెలిగించుదాం. టపాసులు కాల్చే ముందు ఈ అమాయక ప్రాణులను దృష్టిలో పెట్టుకుందాం. అవి భయపడుతుంటే చూడటం బాధగా ఉంది’’ అంటూ రోహిత్ ఓ కుక్క వణికిపోతున్న వీడియోను షేర్ చేశాడు. దీపావళికి వెలుగులు తీసుకొచ్చే టపాసులు కాల్చవద్దనే అర్థంలో రోహిత్ చేసిన ట్వీట్ కాస్త విమర్శలకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు రోహిత్‌పై విరుచుకుపడుతున్నారు.
‘కుక్కకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారా?? మరి న్యూ ఇయర్ అప్పుడు కుక్క ఇయర్ బడ్స్ పెట్టుకుంటుందా??’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘భారత్ మ్యాచ్ గెలిస్తే.. దీపావళి కంటే ఎక్కువ టపాసులు కాలుస్తారు? కానీ, మీకు దీపావళి అప్పుడే జ్ఞానం వస్తుందా?’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ఐదు నెలల క్రితం నువ్వు ఇదే టపాసులు ఎంజాయ్ చేశావు?? గుర్తు తెచ్చుకో’ ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘నువ్వు ఐపీఎల్ ఆడటం ఆపేయ్. అందులోనే టపాసులు ఎక్కువ కాలుస్తారు కదా’ అని మరొక అభిమాని చమత్కరించాడు. ‘ఐపీఎల్ ఆడటం ఎప్పుడు మానేస్తున్నావు మరి’ అని ఒక అభిమాని ఎద్దేవా చేశాడు.























