సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ రూపొందిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ రూపొందించనున్న సినిమాను పట్టాలెక్కిస్తారు. బాలయ్యకు `సింహా`, `లెజెండ్` వంటి విజయాలు అందించిన బోయపాటి ఈ మూడో సినిమాలో బాలయ్యను మరింత విభిన్నంగా చూపించబోతున్నారట. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట.
ఈ సినిమా కోసమే బాలయ్య ప్రస్తుతం జిమ్‌లో చెమటోడుస్తున్నారట. మొత్తం పాతిక కేజీల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్న బాలయ్య.. ఇప్పటికి 15 కేజీల బరువు తగ్గారట. మరో పది కేజీల బరువు తగ్గేందుకు వర్కవుట్స్ చేస్తున్నారట. డైట్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారట. బోయపాటి సినిమాలో పూర్తి కొత్త లుక్‌లో కనిపించేందుకే బాలయ్య ఇంతగా చెమటోడుస్తున్నారట.




























