సిగ్గులేకుండా బోల్డ్ గా మాట్లాడిన స్టార్ హీరొయిన్….గ్రేట్!

0
197

తెలుగు ప్రేక్షకుల ముందుకు బోల్డ్‌ పాత్ర చేసి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రంలో ఒక హీరోయిన్‌ ఇలా కూడా ఉంటుందా అంటూ దర్శకుడు చూపించాడు.విభిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌కు ఒక్కసారిగా స్టార్‌ క్రేజ్‌ దక్కింది.

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా ఈమె నటించిన ఆర్డీఎక్స్‌ లవ్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.మరీ ఇంత బోల్డ్‌గా పాయల్‌ నటించాల్సిన అవసరం ఏంటీ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీఎక్స్‌ లవ్‌ చిత్రంలో కొన్ని సీన్స్‌ మరీ బరితెగించినట్లుగా ఆడవారు తలదించుకునే విధంగా ఉన్నాయి.అలాంటి సీన్స్‌ను చేయడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పాయల్‌ రాజ్‌ పూత్‌ స్పందించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ నేను ముంబయిలో 6 సంవత్సరాల పాటు అవకాశాల కోసం తిరిగాను.ఆ సమయంలో నేను ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేను ఇప్పుడు డబ్బులు వస్తాయంటే ఎలా నటించేందుకు అయినా సిద్దం.ఆర్టీఎక్స్‌ లవ్‌ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తే ఎక్కువ పారితోషికం ఇస్తామన్నారు.అందుకే అడ్డు చెప్పకుండా బోల్డ్‌గా నటించేందుకు ఓకే చెప్పాను.నేను ఏం చేసినా కూడా డబ్బు కోసమే.నాకు ఇష్టం లేకపోయినా కూడా డబ్బు కోసం చేసుకుంటూ పోయానంటూ నిర్మొహమాటంగా బోల్డ్‌ వ్యాఖ్యలు చేసింది.ఇలా డైరెక్ట్‌గా చెప్పడం అంటే మామూలు విషయం కాదు, నిజంగా పాయల్‌ గ్రేట్‌ అంటూ కొందరు అభినందిస్తున్నారు.