మెగా ఫ్యామిలీ గుప్పిట్లో రాష్ట్రంలోని థియేటర్లు..!

0
406

చిరంజీవి హీరోగా రాంచరణ్ నిర్మాణ సారధ్యంలో, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం… సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇక సినిమాలో చిరంజీవి చేయబోయే విన్యాసాల గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బి అమితాబ్, జగపతి బాబు, నయనతార వంటి భారీ తారాగణం నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం దాదాపు అన్ని దియేటర్లను బుక్ చేశారు నిర్మాతలు. నైజా౦, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో దాదాపు అన్ని హాళ్ళను ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ బుక్ చేసింది.

ఇప్పుడు దీనిపై చిన్న సినిమాల నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలను విడుదల కానీయకుండా చేసి ఈ సినిమాను మాత్రమే కీలకమైన దసరాకు విడుదల చేస్తే మామూలు రోజుల్లో తమ సినిమాలను చూసే వారు ఎవరు ఉంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, తర్వాత అన్నీ పిల్లలకు పరిక్షలే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాను జనాలకు బలవంతంగా పండగా సమయంలో చూపించాలని భావించడం ఎంత వరకు సమంజసమని ఇతర హీరోల అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.