విశాఖ చేరుకున్న ప్రత్యేక నిపుణుల బృందం

0
209

గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు 9 మంది నిపుణులతో కూడిన బృందం అర్థరాత్రి తరువాత విశాఖకు చేరుకుంది. కాగా గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు 9మంది నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న విశాఖ పోలీస్‌ కమిషనర్‌  ఆర్‌కే మీనా, డీసీపీ ఉదయ్‌భాస్కర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లీకేజీని అరికట్టే సమయంలో పేలుడు సంభవిస్తుందనేది పుకారు మాత్రమేనని ఆర్‌కే మీనా పేర్కొన్నారు.  ముందుజాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీ నుంచి కిలోమీటర్‌ దూరం వరకు ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామన్నారు. గ్యాస్‌లీకేజీ అరికట్టే సమయంలో ఇబ్బందులు ఎదురైనా పేలుడులాంటి ఘటనలుండవని, ప్రజలెవరూ పుకార్లను నమ్మవద్దన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here