చిరంజీవి జగన్ ల కలయికకు సహకరించిన నాగార్జున..!

0
174
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చిరంజీవిల మధ్య భేటీ జరగడం వెనుక నాగార్జున సహకారం ఉంది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ‘సైరా’ మూవీని చూడటానికి జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించే ఉద్దేశ్యంతో ఈ భేటీ ప్రధాన లక్ష్యం అయినప్పటికీ ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన జగన్ చిరంజీవిలు తమ పాత పరిచయాలతో మరేమైన విషయాలు మాట్లాడుకుంటారా అన్న ఆ శక్తి చాలామందిలో ఉంది.
నాగార్జున చిరంజీవిలు అనేక వ్యాపారాలలో భాగస్వాములుగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. దీనికితోడు నాగార్జున చిరంజీవిల మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. చిరంజీవిని టార్గెట్ చేస్తూ నాగార్జున ఎప్పుడు ఒక్క కామెంట్ చేసిన సందర్భాలు కూడ లేవు.
ఈ సాన్నిహిత్యంతోనే చిరంజీవిని జగన్ కు దగ్గర చేసే ఉద్దేశ్యంతో నాగ్ వ్యూహాత్మకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సహకరించి ఉంటాడు అన్న అంచనాలు వస్తున్నాయి. నాగార్జున మేనల్లుడు సుమంత్ జగన్ లు చిన్నప్పుడు ఒకే స్కూల్ లో చదువుకున్న పరిస్థితులలో అనేక సార్లు జగన్ అక్కినేని నాగేశ్వరావు ఇంటికి వెళ్ళి తనతో చిన్నతనంలో ఆటలు ఆడుకున్నట్లు సుమంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
దీనితో జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా అక్కునేని కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంతో తమ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఆ చనువుతోనే నాగ్ కీలక పాత్ర తీసుకుని చిరంజీవి జగన్ ల కలయికకు సహకరించి ఉంటాడు అన్న అంచనాలు వస్తున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ చిరంజీవి జగన్ ను కలవడంతో తాను అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తుంటే కాపు సామాజిక వర్గ నేతగా ఎదిగిన చిరంజీవి తనను కలవడం ద్వారా కాపు సామాజిక వర్గం అంతా తనను తన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తోంది అని రాజకీయ సంకేతాలు ఇవ్వడానికి వీరిద్దరి భేటీ అన్ని విధాల సహకరిస్తోంది అని అనుకోవాలి..